- గన్నవరం పోలీస్ స్టేషన్‌లో వంశీపై కేసు నమోదు
- సిట్ విచారణ నేపథ్యంలో కొత్త ఆరోపణలు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై భూకబ్జా ఆరోపణలతో మరో కేసు నమోదైంది. గన్నవరం గాంధీ బొమ్మ సెంటరులో రూ.10 కోట్ల విలువైన స్థలాన్ని ఆక్రమించారనే ఆరోపణలతో బాధితులు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు న్యాయవాది సుంకర కృష్ణమూర్తి భార్య సుంకర సీతామహాలక్ష్మి ఈ ఫిర్యాదు చేశారు. భూకబ్జా, అక్రమ మైనింగ్, బెదిరింపుల కేసుల్లో సమగ్ర విచారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఏలూరు రేంజ్ ఐజీ ఐవీజీ అశోకకుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందం దర్యాప్తు ప్రారంభించింది.
వంశీ కస్టడీ, విచారణ పురోగతి
ఇక కిడ్నాప్ కేసులో వంశీని పోలీసులు మూడు రోజుల కస్టడీకి తీసుకున్నారు. బాధితుడు సత్యవర్ధన్ స్టేట్‌మెంట్ ఆధారంగా విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశాల మేరకు విచారణ కొనసాగుతోంది. విచారణ సమయంలో వంశీ లాయర్లు రోజుకు నాలుగు సార్లు అతనితో మాట్లాడేందుకు కోర్టు అనుమతిచ్చింది. ఈ కేసుల్లో వంశీ రిమాండ్ గడువు మార్చి 11 వరకు పొడిగించారు. నేటితో రిమాండ్ ముగియడంతో వర్చువల్ విధానంలో న్యాయమూర్తి ఎదుట హాజరు పరచారు.





