- ఇకపై ఇల్లు కట్టడం మరింత సులువు, పటిష్టంగా మారనుంది.
- ఐఐటీ ఇండోర్ పరిశోధనతో ఆహార వ్యర్థాలతో రెట్టింపు బలం కలిగిన కాంక్రీట్ తయారీ.
ఇల్లు కట్టేవారికి గుడ్ న్యూస్. ఇకపై ఇల్లు కట్టడం మరింత సులువు, పటిష్టంగా మారనుంది. ఐఐటీ ఇండోర్ పరిశోధనతో ఆహార వ్యర్థాలతో రెట్టింపు బలం కలిగిన కాంక్రీట్ తయారీ సాధ్యమవుతుంది. కాంక్రీట్లో ఉండే ఈ-కొలి బ్యాక్టీరియాతో ఆహార వ్యర్థాలను కలిపితే కాంక్రీట్ మరింత బలంగా తయారవుతుందని పరిశోధకులు గుర్తించారు. అంతేకాదు, దీనివల్ల కర్బన ఉద్గారాలు కూడా తగ్గుతాయని పరిశోధకులు తెలిపారు.
బలం ఎలా పెరుగుతుంది?
ఆహార వ్యర్థాలు కుళ్ళినప్పుడు కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుంది. ఈ వ్యర్థాలను కాంక్రీట్లోని ఈ-కొలి బ్యాక్టీరియాతో కలిపితే, వాటి మధ్య చర్య జరుగుతుంది. కార్బన్ డయాక్సైడ్, కాంక్రీట్లోని కాల్షియం అయాన్లతో కలిసి క్యాల్షియం కార్బోనేట్ స్ఫటికాలు ఏర్పడతాయి. ఈ స్ఫటికాలు కాంక్రీట్లోని రంధ్రాలు, పగుళ్లను పూడ్చడంతో దాని బలం పెరుగుతుంది. ఈ ప్రయోగంలో కాలీఫ్లవర్, బంగాళాదుంప, మెంతికూర, ఆరెంజ్, బొప్పాయి వ్యర్థాలను వాడారు.





