పోలీసుల సైలెంట్ మూవ్: ఇంటి నుంచి పోసాని పికప్! తర్వాత ఎవరు!!?

  • ఏపీ పోలీసులు బుధవారం రాత్రి సైలెంట్‌గా పోసాని కృష్ణమురళీని ఇంటి నుంచి తీసుకెళ్లారు
  • గత ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేనపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చర్య

ప్రముఖ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళీ ఇంటి తలుపు ఏపీ పోలీసులు బుధవారం రాత్రి తట్టారు. ముందుగా అరెస్ట్ నోటీసును అందజేయగా, ఆయన భార్య నిరాకరించడంతో కేసు వివరాలు చెప్పి కారెక్కించారు. ఎన్నికల ముందు, సమయంలో టీడీపీ, జనసేనపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే అలీ, రామ్ గోపాల్ వర్మ లాంటి సినీ ప్రముఖులు రాజకీయ విమర్శలకు బ్రేక్ వేశారు. గతంలో పోసాని కూడా తాను ఇకపై రాజకీయం మాట్లాడబోనని పేర్కొన్నా, అప్పటి ప్రతిపక్ష నేతలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సమస్యగా మారాయి. ఈ ఘటనతో ఇంకెవరికి వంతొచ్చిందోనన్న చర్చ సినిమా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *