స్వర్ణాంధ్ర లక్ష్యంగా ఏపీ బడ్జెట్ 2025-26

  • రూ. 3.20 లక్షల కోట్ల మేర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
  • సూపర్ సిక్స్ పథకాలకూ, మూలధన వ్యయానికి ప్రాధాన్యం

ఏపీ ప్రభుత్వం శుక్రవారం 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈసారి బడ్జెట్‌లో స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. రూ. 3.20 లక్షల కోట్ల మేర బడ్జెట్‌ను శాసనసభలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం వంటి సూపర్ సిక్స్ పథకాలకు పెద్దపీట వేయనున్నారు.

వ్యవసాయ బడ్జెట్, అభివృద్ధి ప్రాధాన్యం

ఆర్థిక బడ్జెట్ అనంతరం వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. రైతులకు వడ్డీలేని రుణాలు, తగిన ఆర్థిక సాయం కేటాయించే అవకాశముంది. అమరావతి, పోలవరం ప్రాజెక్టులతో పాటు పీపీపీ మోడల్‌లో కొత్త ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించనున్నారు. మధ్యతరగతి కుటుంబాలకు పన్నుల భారం లేకుండా, విద్యుత్ ఛార్జీలను నియంత్రించే దిశగా చర్యలు ఉంటాయని తెలుస్తోంది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *