ఆసియా కప్ 2025: భారత్ vs పాకిస్థాన్ తలపడే అవకాశం మూడు సార్లు! రచ్చ రచ్చే!!

  • తటస్థ వేదికలో ఆసియా కప్ – యూఏఈ లేదా శ్రీలంకలో జరిగే ఛాన్స్
  • గరిష్ఠంగా మూడు సార్లు తలపడే అవకాశం ఉన్న భారత్, పాక్

క్రికెట్ ప్రేమికులకో గుడ్ న్యూస్. ఈ ఏడాది ఆసియా కప్ లో భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ మూడుసార్లు జరగొచ్చు. సెప్టెంబర్ రెండో వారం నుంచి నాలుగో వారం వరకు టీ20 ఫార్మాట్ లో ఈ టోర్నీ నిర్వహించనున్నట్లు సమాచారం. భారత్, పాక్ రాజకీయ పరిస్థితుల వల్ల తటస్థ వేదిక లో టోర్నీ జరుగనుంది. క్రిక్ బజ్ సమాచారం ప్రకారం, ఆసియా కప్ శ్రీలంక లేదా యూఏఈ లో జరగనుంది. బీసీసీఐనే హోస్ట్‌గా వ్యవహరిస్తుంది.

భారత్ – పాక్ మూడుసార్లు తలపడే అవకాశం

టోర్నీ ఫార్మాట్ ప్రకారం, గ్రూప్ దశలో ఒకసారి, సూపర్-4లో మరోసారి, ఫైనల్‌కు చేరితే మూడోసారి భారత్, పాక్ తలపడొచ్చు. గతేడాది 2023 ఆసియా కప్ లోనూ ఇదే ప్లాన్ చేశారు. కానీ వర్షం కారణంగా గ్రూప్ దశలో మ్యాచ్ రద్దయింది. ఇక సూపర్-4లో భారత్ పాక్‌ను ఓడించగా, ఫైనల్‌లో శ్రీలంకపై గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *