- మెదడు వ్యాధితో చదవడం, రాయడం, నడవడం మర్చిపోయిన యువతి
- నాన్నే గురువు.. అక్షరాలు నేర్పుతూ కొత్త జీవితం అందిస్తున్న తండ్రి
రాజస్థాన్‌లోని జయపురకు చెందిన 24 ఏళ్ల పద్మజకు తలనొప్పి మొదలైందని నమ్మలేకపోయారు ఆమె తల్లిదండ్రులు. “నిద్ర సరిగ్గా లేకపోవచ్చు.. స్ట్రెస్సేమో..” అని చిన్న విషయంగా తీసుకున్నారు. కానీ అది జీవితాన్ని మార్చేసే వ్యాధిగా మారుతుందని ఎవరికీ ఊహకూడా లేదు. మెదడులో ఏర్పడిన అరుదైన ఇన్ఫెక్షన్ ఆమెకు చదవడం, రాయడం, నడవడం, తినడం, మాట్లాడటం అన్నింటినీ మర్చిపోయేలా చేసింది.
‘తండ్రి చేతులు పట్టి మళ్లీ నడవడం నేర్చుకుంటున్నా..’
పద్మజ ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చినా.. ఆమెకు ఇంటి చిరునామా గుర్తొచ్చినా.. జీవిత గమనం మర్చిపోయింది. “అమ్మా.. నాకు ఏమైంది?” అని అడిగే ఆమె ప్రశ్నకు తల్లి కన్నీటిని ఆపుకోలేకపోయింది. పిల్లను అక్షరాలు నేర్పించిన తండ్రే.. ఇప్పుడు నడవడం, మాట్లాడడం మళ్లీ నేర్పిస్తున్నాడు. ఏడాది సెలవు పెట్టి ఆమెకు అబీసీలు నేర్పుతున్నాడు.
‘కెమెరా పట్టడం నేర్చుకుంటా.. మళ్లీ కలలు కంటా!’
ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ అంటే పద్మజకు ప్రాణం. కానీ ఇప్పుడు కెమెరా ఎలా పట్టాలో కూడా తెలియని స్థితిలో ఉంది. ‘కానీ నేను కోలుకుంటా.. మళ్లీ నేర్చుకుంటా.. కెమెరా తీసుకుని నా కలలను మళ్లీ జీవిస్తా’ అంటుంది పద్మజ. ఈ అమ్మాయి పోరాటాన్ని చూసి కుటుంబసభ్యులు, స్నేహితులు ఆశ్చర్యపోతున్నారు. వైద్యుల ప్రకారం ఇలాంటి వ్యాధులు కొన్నిసార్లు దంతాలు, ముక్కు, చెవి నుంచి కూడా మెదడుకు వ్యాపించే ప్రమాదం ఉంది.





