- సూపర్ సిక్స్ కాదు, సూపర్ ఫ్లాప్ – షర్మిల విమర్శలు
- అన్నదాతలకు అన్యాయం, మహిళా సంక్షేమానికి పట్టింపులేకుండా బడ్జెట్
ఏపీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌పై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. “ఇది అంకెల గారడి, అభూత కల్పన. దిశా, దశ లేని బడ్జెట్” అంటూ విరుచుకుపడ్డారు. ప్రజా సంక్షేమం పక్కన పెట్టి, ఎన్నికల హామీలను విస్మరించారని ఆరోపించారు. “అన్నదాత సుఖీభవ పథకానికి అవసరమైన రూ.11 వేల కోట్ల బదులు కేవలం రూ.6,300 కోట్లు కేటాయించారని దుయ్యబట్టారు.
54 లక్షల మంది రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అలాగే తల్లికి వందనం, ఉచిత సిలిండర్లకు తక్కువ నిధులు కేటాయించారని అన్నారు. “మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రస్తావనే లేదు. మహాశక్తి పథకం, డ్వాక్రా రుణాలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ గాలికొదిలేశారు” అంటూ విమర్శించారు.





