- కృష్ణా-గుంటూరు పట్టభద్రుల స్థానంలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఘన విజయం
- ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో గాదె శ్రీనివాసులునాయుడు గెలుపు
రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు భారీ ఆధిక్యం సాధించారు. ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గంలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ 82,320 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. మొత్తం 2,41,873 ఓట్లు పోలవగా, 60 శాతం పైగా ఓట్లు ఆలపాటి దక్కించుకున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో గాదె శ్రీనివాసులునాయుడు 12,035 ఓట్లతో విజయం సాధించారు. మేజిక్ ఫిగర్ 10,068 కాగా, అందుకు మించి ఓట్లు సాధించడంతో ఆయనను విజేతగా ప్రకటించారు. ఉభయగోదావరి పట్టభద్రుల స్థానంలో కూడా కూటమి ఆధిక్యంలో ఉంది.





