- టీడీపీకి నాలుగు, జనసేనకు ఒక ఎమ్మెల్సీ స్థానం కేటాయింపు
- జనసేన నుంచి నాగబాబుకు అవకాశం ఖరారు అయినట్లు సమాచారం
ఏపీ శాసనమండలి ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో నాలుగు స్థానాలు టీడీపీకి, ఒకటి జనసేనకు కేటాయించనున్నట్లు సమాచారం. జనసేన తరఫున నాగబాబు ఎంపిక ఆల్మోస్ట్ ఫైనల్ కాగా, టీడీపీ అభ్యర్థుల ఎంపికపై ఇంకా స్పష్టత రాలేదు. నామినేషన్ల స్వీకరణ ఈ నెల 10 వరకు కొనసాగనుంది. 20న పోలింగ్, అదే రోజు ఫలితాల ప్రకటింపు జరుగుతుంది. ఇదిలా ఉంటే, సీఎం చంద్రబాబు ఇప్పటికే నాగబాబును కేబినెట్లోకి తీసుకుంటామని స్పష్టం చేసిన నేపథ్యంలో, ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఖరారైనట్టేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.





