- అంతరిక్షంలో చిక్కుకున్న భారత సంతతి వ్యోమగామి
- ఐఎస్ఎస్ నుంచి మార్చి 19న తిరిగి రానున్న సునీతా, విల్మోర్
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి వచ్చే విషయంలో నెలకొన్న అనిశ్చితి గురించి మాట్లాడారు. ఇప్పటికే దాదాపు తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉండిపోయిన ఆమె, తోటి వ్యోమగామి బచ్ విల్మోర్ తమ ప్రయాణంపై స్పందించారు. “ఇక్కడ ఎక్కువ కాలం ఉండటం అంత సులభం కాదు. కానీ మేము బలంగా ఉన్నాం” అని సునీతా అన్నారు. తమ రాక ఆలస్యమైన నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందంటూ వచ్చిన విమర్శలను తాను పట్టించుకోనని స్పష్టం చేశారు.
రాకపై స్పష్టత!!
2024 జూన్లో బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్లైనర్’ ద్వారా ఐఎస్ఎస్కు వెళ్లిన వీరు వారం రోజుల్లోనే తిరిగి రావాల్సి ఉంది. కానీ, సాంకేతిక సమస్యల వల్ల ఆ వ్యోమనౌక లేకుండానే భూమికి చేరింది. అప్పటి నుంచి వీరు అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. ఇప్పుడు మార్చి 12న స్పేస్ఎక్స్ క్రూ-10 నౌక కొత్త వ్యోమగాములను ఐఎస్ఎస్కు పంపనుంది. ఆ తర్వాత మార్చి 19న సునీతా విలియమ్స్, విల్మోర్ భూమికి తిరిగి ప్రయాణమవుతారని నాసా స్పష్టం చేసింది. “ఇప్పుడు అత్యున్నత దశలో ఉన్నాం. నిష్క్రమించడానికి ఇదే సరైన సమయం” అని సునీతా వ్యాఖ్యానించారు.





