ఏపీ మహిళా సంఘాల ఘనత – గిన్నిస్ రికార్డు దిశగా!!

ఒకే రోజు రూ.5 కోట్ల విలువైన ఉత్పత్తుల విక్రయం.. 3 లక్షల ఆర్డర్లతో భారీ ప్రతిస్పందన.. వాణిజ్యంలో మహిళా సంఘాల విప్లవం!!

ఆంధ్రప్రదేశ్‌లోని స్వయం సహాయక సంఘాలు (SHGs) ప్రపంచ వాణిజ్య రంగంలో తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. ఈ నెల 8న ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించే విక్రయ కార్యక్రమం ద్వారా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఓఎన్‌డీసీ (ONDC) ద్వారా రూ.5 కోట్ల విలువైన ఉత్పత్తులను విక్రయించనున్నారు. ఇప్పటికే 3 లక్షల ముందస్తు ఆర్డర్లు వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విక్రయ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రత్యేకంగా ఈ-కామర్స్‌ ద్వారా మహిళా సంఘాల ఉత్పత్తులను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకున్నారు. వివిధ జిల్లాల నుంచి తయారైన పచ్చళ్లు, జూట్‌ బ్యాగులు, కొండపల్లి బొమ్మలు, అగర్‌బత్తీలు, ఫినాయిల్‌ వంటి ఉత్పత్తులకు అధిక డిమాండ్‌ కనిపిస్తోంది. గిన్నిస్‌ ప్రతినిధులు ఈ ప్రక్రియను పరిశీలించి, రికార్డు ప్రామాణికతను గుర్తించనున్నారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *