వాలంటీర్ల బలవంతపు రాజీనామా, లిక్కర్ గోదాం కేసుల్లో నోటీసులు.. గుడివాడ పోలీస్ స్టేషన్లో హాజరైన వైఎస్సార్సీపీ నేత అనుచరులు
మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కొడాలి నాని అనుచరులకు గుడివాడ పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. పాలడుగు రాంప్రసాద్, గొర్ల శ్రీను, దుక్కిపాటి శశిభూషణ్ ఈ నోటీసులు అందుకున్నారు. వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించడం, లిక్కర్ గోదాం అక్రమ కేసుల్లో వీరిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ రెండు ఘటనల్లో కొడాలి నాని, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, అప్పటి జేసీ మాధవీలతారెడ్డి తదితరులపై కేసు నమోదైంది. నిందితులను విచారణ చేయాలని ఏపీ హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గుడివాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో నోటీసులు అందుకున్నారు.





