పిల్లలకు ఒంటిపూట బడులు షురూ! ఎప్పటి నుంచో తెలుసా?

పిల్లలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒంటిపూట బడులు రానేవచ్చాయి. రాష్ట్రంలోని పాఠశాలల్లో మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పాఠశాలలు కొనసాగుతాయి. పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1:15 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు.

మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు.. ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పాఠశాలల నిర్వహణ.

రాష్ట్రంలో ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. వేసవి తాపం పెరగడంతో డీహైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రాబోయే నెలలో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని, చిన్న పిల్లలు, వృద్ధులు సాధ్యమైనంత వరకు వేడి గాలులకు తిరగకపోవడం మంచిదని సూచిస్తున్నారు. వేసవిలో వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు మధ్యాహ్నం వేళల్లో బయట తిరగకపోవడం మంచిది. అలాగే, నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలి. జ్యూస్ లు, పండ్ల రసాలు తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండవచ్చు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *