- నాసా తాజా అప్‌డేట్: మరో కొన్ని గంటల్లో భూమికి తిరుగు ప్రయాణం
- స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్: సునీతా విలియమ్స్, విల్మోర్ సురక్షితంగా ల్యాండ్ కానున్నరు
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ చివరికి భూమికి తిరిగి రానున్నారు. సుమారు 9 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లో చిక్కుకుపోయిన ఆమె, సహచర వ్యోమగామి బుచ్ విల్మోర్ తో కలిసి తిరిగి వస్తున్నారు. మంగళవారం (అమెరికా కాలమానం ప్రకారం) సాయంత్రం 5.57 గంటలకు వీరి రాక షెడ్యూల్ అయింది. స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా వీరిని భూమికి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
సునీతా రాకకు మార్గం సుగమం
సునీత, విల్మోర్‌ను తీసుకురావడానికి క్రూ డ్రాగన్ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రంతో ఇప్పటికే అనుసంధానమైంది. సోమవారం రాత్రి 10.45 గంటలకు హ్యాచ్ మూసివేయగా, అర్ధరాత్రి 12.45 గంటలకు ISS నుంచి వేరు కానుంది. అనంతరం మంగళవారం సాయంత్రం 4.45 గంటలకు భూమికి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. చివరికి 5.57 గంటలకు ఫ్లోరిడా తీరానికి సమీపంలోని సముద్ర జలాల్లో స్ప్లాష్‌డౌన్ అవుతుంది. 2024 జూన్‌లో స్టార్‌లైనర్ వ్యోమనౌకలో వీరు ISS చేరుకోగా, సాంకేతిక లోపాల కారణంగా భూమికి తిరిగి రావడం ఆలస్యమైంది.





