- 202 మండలాల్లో వడగాలులు: ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచనలు
- అనకాపల్లి జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత 42.1°C
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవి ప్రభావం తీవ్రంగా ఉంది. ఆదివారం పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 42 డిగ్రీలు దాటిపోయింది. ఉదయం 8 గంటల తర్వాతనే ప్రజలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి. అనకాపల్లి జిల్లా నాతవరంలో 42.1°C, నంద్యాల, విజయనగరం, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో 41°C పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకారం, సోమవారం 202 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, తూర్పుగోదావరి, గుంటూరు, కాకినాడ సహా పలు జిల్లాల్లో వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని, అధికారుల హెచ్చరిక. వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సెల్‌ఫోన్లకు హెచ్చరికలు పంపే చర్యలు చేపడుతున్నారు.





