- కట్నం కోసం చిత్రహింసలు, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు కుట్ర
- గుంటూరులో యువతి మృతి.. భర్త, కుటుంబంపై కేసు నమోదు
ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా పరిచయం ఏర్పడి ప్రేమగా మారిన ఒక సంబంధం చివరకు దారుణ హత్యగా మారింది. వరంగల్‌కు చెందిన గీతిక (19), గుంటూరుకు చెందిన సాయి మణికంఠను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కేవలం 6 నెలల్లోనే కట్నం వేధింపులతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
గీతిక మృతిపై కుటుంబసభ్యుల ఆందోళన
గీతికను శారీరకంగా, మానసికంగా వేధించిన భర్త, కట్నం తీసుకురావాలని ఒత్తిడి పెంచాడు. చివరకు ఈ నెల 14న గీతిక తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి వేధింపుల గురించి చెప్పింది. మరుసటి రోజే ఆమె ఉరి వేసుకుని చనిపోయినట్లు భర్త కుటుంబం ప్రకటించింది. అయితే, ఇది హత్యే అంటూ గీతిక కుటుంబం ఆందోళనకు దిగింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు సాయి మణికంఠను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం వరంగల్‌కు తరలించారు. ఈ ఘటన గుంటూరులో తీవ్ర కలకలం రేపింది.





