- హోల్‌స్టెయిన్ ఫ్రైసియన్ జాతికి చెందిన ‘సోనీ’ గోవు
- కర్నాల్‌లోని డైరీ మేళాలో 24 గంటల్లో అత్యధిక పాల ఉత్పత్తి
సాధారణంగా ఒక ఆవు రోజుకు 5-10 లీటర్ల పాలు ఇస్తుంది. కానీ హరియాణాలోని కర్నాల్ జిల్లా కు చెందిన సునీల్, శాంకీ సోదరులు పెంచుతున్న హోల్‌స్టెయిన్ ఫ్రైసియన్ జాతికి చెందిన ‘సోనీ’ గోవు 24 గంటల్లో 87.7 లీటర్ల పాలు ఇచ్చి ఆసియాలోనే అత్యధిక పాల ఉత్పత్తి చేసిన ఆవుగా రికార్డు సృష్టించింది.
గోశాలలో ప్రత్యేక పథకం
ఈ గోవును ప్రత్యేకంగా పోషిస్తున్నామని సునీల్ తెలిపారు. ప్రత్యేకమైన ఆహారం అందించడంతో పాటు, దాణా, గడ్డి, పచ్చిమేత సమతుల్యంగా అందిస్తున్నామన్నారు. మొత్తం 195 గోమాతలతో రెండు పాడి పరిశ్రమలను నిర్వహిస్తున్నారు. నెస్లే సహా నగర వినియోగదారులకు పాలను సరఫరా చేస్తున్నారు. నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ధీర్ సింగ్, “ఇలాంటి వ్యవసాయ పద్ధతులు గ్రామీణ ప్రాంతాల్లో మంచి ఉపాధి అవకాశాలను అందిస్తాయి. రైతులు కలసి పాల ఉత్పత్తిని మెరుగుపరచాలి” అని సూచించారు.





