- హౌస్ ఆఫ్ కామన్స్‌లో చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం
- లండన్‌లో అభిమానుల ఘన స్వాగతం, ఫొటోలు వైరల్
మెగాస్టార్ చిరంజీవి లండన్ చేరుకున్నారు. సినీ, సేవారంగాల్లో చేసిన విశేష కృషికి గుర్తింపుగా హౌస్ ఆఫ్ కామన్స్ – యూకే పార్లమెంట్‌లో ఆయనను ఘనంగా సత్కరించనున్నారు. లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా ఆధ్వర్యంలో మార్చి 19న ఈ కార్యక్రమం జరగనుంది. చిరంజీవిని చూడటానికి లండన్‌లో అభిమానులు భారీగా చేరుకుని ఫ్లెక్సీలతో స్వాగతం పలికారు.
విశ్వంభర, కొత్త ప్రాజెక్ట్స్‌లో చిరు బిజీ
ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భారీ అంచనాలున్నాయి. అలాగే, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రెండు కొత్త సినిమాలకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2025 సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమాను విడుదల చేయనున్నారు.





