- ISSలో 9 నెలల పాటు చిక్కుకుపోయిన సునీతా, విల్మోర్ తిరుగు ప్రయాణం
- బుధవారం తెల్లవారుజామున ఫ్లోరిడా తీరంలో క్రూ డ్రాగన్ ల్యాండ్
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎట్టకేలకు భూమికి తిరిగి రానున్నారు. 2024 జూన్ 5న బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా ISS (అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం)కి వెళ్లిన ఆమె, వారం రోజుల్లో భూమికి తిరిగి రావాల్సి ఉండగా, సాంకేతిక లోపాల కారణంగా 9 నెలల పాటు అక్కడే ఉండిపోయారు. ప్రస్తుతం స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ ద్వారా తిరుగు ప్రయాణం మొదలైంది.
భూమికి రాక ప్రాసెస్ ఇలా..
- ఉదయం 8:15AM – హ్యాచ్ మూసివేత
- ఉదయం 10:15AM – అంతరిక్ష కేంద్రం నుంచి అన్‌డాకింగ్
- బుధవారం 2:41AM – భూవాతావరణంలోకి ప్రవేశం
- బుధవారం 3:27AM – ఫ్లోరిడా తీరంలో సముద్రంలో ల్యాండింగ్
సహాయ బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్‌ను సముద్రం నుంచి వెలికితీసి, వ్యోమగాములను రక్షిస్తాయి. ఈ ప్రయాణం NASA లైవ్ ప్రసారం చేస్తోంది.





