WhatsApp Governance 2.0: ఒక్క మాటతోనే ప్రభుత్వ సేవలు!

  • జూన్ 30 నుంచి ఏఐ ఆధారిత వాయిస్ కమాండ్ సేవలు అందుబాటులోకి
  • టికెట్ బుకింగ్, బిల్లుల చెల్లింపు, ధ్రువీకరణ పత్రాలు—all in one WhatsApp

WhatsApp ద్వారా ప్రభుత్వ సేవలను మరింత వేగంగా, సులభంగా ప్రజలకు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం WhatsApp Governance 2.0 ను జూన్ 30న ప్రారంభించనుంది. ఏఐ ఆధారిత వాయిస్ కమాండ్ సహాయంతో వినియోగదారులు ఒక్క మాటతోనే టికెట్లు బుక్ చేసుకోవచ్చు, బిల్లులు చెల్లించవచ్చు. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో ఈ అంశాన్ని వివరించారు. జనవరి 30 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పాలనా విధానం ఇప్పటివరకు 200కు పైగా సేవలను అందిస్తోంది. జూన్ నాటికి ఇది 500 సేవలకు విస్తరించనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం సేవలు కూడా త్వరలో దీనిలో భాగం కానున్నాయి.

ప్రజలకు మరింత చేరువగా…

WhatsApp Governance ప్రారంభించిన తర్వాత ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం తగ్గిందని లోకేశ్ తెలిపారు. హాల్ టికెట్లు, ధ్రువీకరణ పత్రాలు నేరుగా మొబైల్‌కు అందించడమే కాకుండా, భవిష్యత్తులో QR కోడ్ ఆధారంగా శాశ్వత ధ్రువీకరణ పత్రాలకు చట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తక్కువ సమయంలో ఎక్కువ సేవలను అందించేందుకు WhatsApp Governance 2.0 కీలకంగా మారనుంది. అయితే, ఈ వ్యవస్థపై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. భద్రతాపరంగా ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేస్తూ, WhatsApp Governance‌ను హ్యాక్ చేయగలిగితే రూ.10 కోట్లు ఇస్తానని సవాల్ విసిరారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *