- 72 లక్షల కేసుల్లో రూ.11,185 కోట్ల ఆర్ధిక మోసాలు – కేంద్రం వెల్లడి
- మోసాలను అరికట్టేందుకు AI ఆధారిత టూల్స్ వినియోగ సూచన
దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న కొద్దీ, ఆర్థిక మోసాలు కూడా పెరుగుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభలో తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఏడాది జనవరి 25 వరకు 72.05 లక్షల ఘటనల్లో రూ.11,185 కోట్ల మేర మోసాలు నమోదయ్యాయి. వీటిని నివారించేందుకు రిజర్వ్ బ్యాంక్ ‘సెంట్రల్ పేమెంట్స్ ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రీ’ అమలు చేసింది.
సైబర్ మోసాల నియంత్రణకు కేంద్ర చర్యలు
కాజేసిన డబ్బు మోసగాళ్ల చేతికి వెళ్లకుండా అడ్డుకునేందుకు ‘సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ – మేనేజ్‌మెంట్ సిస్టమ్’ను ప్రారంభించామని కేంద్రం తెలిపింది. దీని ద్వారా ఇప్పటివరకు 13.36 లక్షల ఫిర్యాదుల్లో రూ.4,386 కోట్లను రక్షించగలిగారు. మోసాలను గుర్తించేందుకు AI ఆధారిత టూల్స్ వినియోగించాలని బ్యాంకులకు సూచించారు. డిజిటల్ చెల్లింపుల భద్రతను పెంచేందుకు ఆర్బీఐ తరచుగా మార్గదర్శకాలు జారీ చేస్తోంది.





