“ఎస్సీ వర్గీకరణ – 30 ఏళ్ల పోరాటానికి ముగింపు!”

  • సుదీర్ఘ ప్రయాణంలో న్యాయం సాధించాం – సీఎం చంద్రబాబు
  • జిల్లాల వారీగా వర్గీకరణ 2026 జనగణన తర్వాత

ఎస్సీ వర్గీకరణ (SC Sub Classification)పై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. మూడు వర్గాలుగా ఎస్సీలను విభజిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం సామాజిక న్యాయానికి దారి చూపిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. తాను 1996లో ప్రారంభించిన ఈ ప్రయాణం నేడు విజయవంతమైందని తెలిపారు. చంద్రబాబు మాట్లాడుతూ, 2011 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని వర్గీకరణ అమలు చేస్తున్నట్లు తెలిపారు. 2026 జనగణన అనంతరం జిల్లాల వారీగా మరోసారి వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారు.

  • మొత్తం 59 కులాలను మూడు గ్రూపులుగా విభజించారు:
    1. 1% రిజర్వేషన్ – రెల్లి, అనుబంధ ఉపకులాలు
    2. 6.5% రిజర్వేషన్ – మాదిగ, అనుబంధ కులాలు
    3. 7.5% రిజర్వేషన్ – మాల, అనుబంధ కులాలు
  • రిజర్వేషన్ల పంపిణీ తీరును 200 రోస్టర్ల ప్రకారం అమలు చేయనున్నారు.
  • బుడగజంగం కులాన్ని ఎస్సీ-1 గ్రూప్‌లో చేర్చే తీర్మానం కేంద్రానికి పంపించనున్నారు.

“సామాజిక న్యాయమే నా లక్ష్యం”

చంద్రబాబు తన పాలనలో ఎస్సీ వర్గీకరణ కోసం చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. 1996లో కమిటీ వేసిన నాటి నుంచి ఉషా మెహ్రా కమిషన్, రామచంద్రరావు కమిషన్ నివేదికల ఆధారంగా వర్గీకరణపై చర్చలు జరిగాయని వివరించారు. స్వాతంత్య్రం వచ్చినా ఎస్సీల అసమానతలు కొనసాగుతున్నాయని, ఇప్పుడు తీసుకున్న నిర్ణయం అందరికీ న్యాయం చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *