- దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగొద్దని ప్రధాని మోదీకి విజ్ఞప్తి.
- జనాభా తగ్గిన ప్రాంతాలకు సీట్లు కుదించే ప్రక్రియ నిలిపివేయాలని సూచన.
వచ్చే ఏడాది(2026) జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగొద్దని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. గత 15 ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా వృద్ధి తక్కువగా ఉండటం వల్ల, కొత్త జనాభా గణాంకాల ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే సీట్లు తగ్గే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో సమర్థవంతమైన పాలన కోసం అన్ని రాష్ట్రాలకు సమాన ప్రతినిధిత్వం ఉండాలని జగన్ లేఖలో పేర్కొన్నారు. లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రాతినిధ్యం క్షీణించకుండా చూడాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.





