ఏపీలో ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు – చంద్రబాబు కీలక నిర్ణయం

  • ప్రతి మూడు నెలలకు ఉద్యోగ మేళాలు – నైపుణ్య శిక్షణపై ప్రత్యేక దృష్టి
  • కోవూరు చక్కెర కర్మాగారం భూమిని పరిశ్రమలకు కేటాయింపు

ప్రతి నియోజకవర్గంలో వచ్చే కలెక్టర్ల సదస్సుకు ముందే జాబ్ మేళాలను నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మూడు నెలలకు ఒకసారి ఉద్యోగ మేళాలను నిర్వహించి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. నైపుణ్య శిక్షణ కోసం ప్రతి జోన్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలను నోడల్ ఏజెన్సీలుగా గుర్తించాలని సూచించారు. స్థానిక పరిశ్రమల భాగస్వామ్యంతో శిక్షణను అందించి, వర్క్ ఫ్రం హోమ్ విధానంలో ఆసక్తి ఉన్నవారికి తక్షణ శిక్షణ ఇవ్వాలని చెప్పారు. విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, క్లస్టర్ ఆధారిత విధానంలో ఇప్పటికే శిక్షణ మొదలైందని, నియోజకవర్గాల వారీగా జాబ్ మేళాలు నిర్వహిస్తామని తెలిపారు.

కోవూరు చక్కెర కర్మాగారం మూసుపడిన 124 ఎకరాల భూమిని పరిశ్రమలకు కేటాయించనున్నట్లు సీఎం ప్రకటించారు. కర్మాగారం బకాయిలను రద్దు చేస్తూ, రైతులు, ఉద్యోగులకు బకాయిలుగా ఉన్న రూ.28 కోట్లను ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. అదనంగా, మామిడి రైతులకు ప్రోత్సాహకంగా ఫ్రూట్ కవర్లను సబ్సిడీపై అందించి దిగుబడి పెంచేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు. గ్రామాల్లో పశువుల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు నరేగా నిధులను వినియోగించాలని సూచించారు. తిరుపతిని అత్యంత నివాసయోగ్యమైన నగరంగా అభివృద్ధి చేసేందుకు హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు నిర్మించాలని ఆదేశించారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *