గిరిజన మహిళల చిరునవ్వులు.. పవన్ కళ్యాణ్ చొరవతో చెప్పులు అందజేత!

అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం పెదపాడు గ్రామంలో గిరిజన మహిళల ముఖాలపై చిరునవ్వులు చిందాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో 345 మంది గ్రామస్థులకు కొత్త చెప్పులు అందాయి. ఈ నెల 7న పెదపాడు గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటించగా, చెప్పులు లేకుండా నడిచి వచ్చి స్వాగతం పలికిన ఓ వృద్ధురాలి కష్టం ఆయనను కదిలించింది. వెంటనే చొరవ తీసుకున్న ఆయన, గ్రామస్థులందరికీ పాదరక్షలు అందించేందుకు సర్వే చేయించి, గురువారం వాటిని పంపిణీ చేయించారు.

“పాంగి మిత్తు అనే వృద్ధురాలు చెప్పులు లేకుండా నడిచి వచ్చి స్వాగతం పలకడం చూసి, వెంటనే గ్రామస్థులందరికీ చెప్పులు అందించాలని నిర్ణయించాను,” అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

పవన్ కళ్యాణ్ కార్యాలయ సిబ్బంది బోయిపల్లి పవన్, బృంద సభ్యులు, స్థానిక సర్పంచ్ వెంకటరావు గురువారం ప్రతి ఇంటికి వెళ్లి 345 జతల చెప్పులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, ముఖ్యంగా మహిళలు, తమ కష్టాన్ని గుర్తించి చొరవ తీసుకున్న పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, పవన్ సామాజిక స్పృహకు నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *