పహల్గాం ఉగ్రదాడిపై భారత భద్రతా బలగాలు, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఈ కేసును అధికారికంగా తీసుకుంది. అయితే, దాడి జరిగిన వెంటనే ఎన్‌ఐఏ బృందాలు పహల్గాంలో విచారణ ప్రారంభించాయి. సీఆర్పీఎఫ్ క్విక్ యాక్షన్ టీమ్ తొలి స్పందనతో ఘటనాస్థలానికి చేరి చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. దీంతో, పర్యాటకులను సురక్షితంగా తరలించారు.
ప్రత్యక్ష సాక్షుల ఫోటోలు, వీడియోలను పరిశీలిస్తున్నాం. అనుమానితులపై సమాచారం ఇవ్వాలి!” – ఎన్‌ఐఏ అధికారి.
ఎన్‌ఐఏ బృందం ప్రత్యక్ష సాక్షులను విచారిస్తోంది. ఫోటోలు, వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. అంతేకాదు, బైసరన్ ప్రాంతంలో ఫోరెన్సిక్ బృందంతో తనిఖీలు ముమ్మరం చేసింది. ఇదిలా ఉంటే, 25 మంది కమాండోల బృందం 40-45 నిమిషాల ట్రెక్కింగ్‌తో ఘటనాస్థలానికి చేరింది. ఉగ్రవాదుల కోసం డ్రోన్‌లతో గాలింపు కొనసాగుతోంది. హోటల్స్, లాడ్జ్‌లలో జమ్మూకశ్మీర్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు





