అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం క్రాష్: 242 మందితో ప్రమాదం!

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం (జూన్ 12, 2025) మధ్యాహ్నం ఎయిర్ ఇండియా విమానం AI171 కూలిన ఘటన దేశాన్ని కలవరపెట్టింది. లండన్‌కు బయల్దేరిన ఈ బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌లో 230 ప్రయాణికులు, 12 మంది సిబ్బంది సహా 242 మంది ఉన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి మధ్యాహ్నం 1:47 గంటలకు టేకాఫ్ అయిన 9 నిమిషాలకే మేఘనీనగర్‌లోని షాహీబాగ్ సమీపంలో విమానం కూలింది. క్రాష్ సైట్ నుంచి దట్టమైన పొగలు, శిథిలాలు వాస్తాపూర్ వరకు కనిపించాయి.

ఎయిర్ ఇండియా విమానం AI171 టేకాఫ్ అయిన 9 నిమిషాలకే మేఘనీనగర్‌లో కూలింది!

ఎమర్జెన్సీ సర్వీసెస్, ఫైర్ డిపార్ట్‌మెంట్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) 90 మంది సిబ్బందితో మూడు టీమ్‌లను గాంధీనగర్ నుంచి, మరో మూడు టీమ్‌లను వడోదర నుంచి పంపింది. గుజరాత్ CM భూపేంద్ర పటేల్ రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్స్‌ను వేగవంతం చేయాలని ఆదేశించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్ అధికారులతో మాట్లాడి, కేంద్ర సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎయిర్ ఇండియా ప్రకటనలో, “AI171 విమానం ప్రమాదంలో చిక్కుకుంది. వివరాలు సేకరిస్తున్నాం, త్వరలో ఎక్స్‌లో అప్‌డేట్స్ ఇస్తాం,” అని తెలిపింది. ప్రమాదంలో గాయపడినవారి స్థితి, హతమైనవారి సంఖ్యపై ఇంకా స్పష్టత లేదు. దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *