అహ్మదాబాద్ విమాన ప్రమాదం: ఇంజన్ ఫెయిల్యూరా,ఇంకా మరేదైనా!!?

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం AI171 కూలిన ఘటన దేశాన్ని షాక్ కి గురి చేస్తోంది. లండన్ గాట్విక్‌కు బయల్దేరిన ఈ బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌లో 242 మంది (230 ప్రయాణికులు, 12 సిబ్బంది) ఉన్నారు. 1:47 గంటలకు టేకాఫ్ అయిన 9 నిమిషాలకే, 825 అడుగుల ఎత్తు నుంచి మేఘనీనగర్‌లోని షాహీబాగ్ సమీపంలో కూలింది. దట్టమైన పొగలు, శిథిలాలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. “రెండు ఇంజన్లు ఫెయిల్ అయ్యాయి, పైలట్ మేడే కాల్ ఇచ్చారు,” అని మాజీ పైలట్ సౌరభ్ భట్నాగర్ తెలిపారు. ఇది టెక్నికల్ ఫెయిల్యూరా లేక సబోటాజా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. సామాన్యులు “విమానంలో బాంబు ఉందా? టెర్రరిస్ట్ ఎటాకా?” అని ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎయిర్ ఇండియా విమానాలపై బాంబు దాడుల చరిత్ర ఈ భయాలను పెంచుతోంది.

ఇంజన్ ఫెయిల్యూరా, సబోటాజా? అహ్మదాబాద్ విమాన ప్రమాదం అనేక అనుమానాల్ని రేకెత్తిస్తోంది!!

ఎయిర్ ఇండియా విమానం AI171 కూలిన ఘటనలో, ఇంజన్ ఫెయిల్యూర్ లేదా టెక్నికల్ లోపం కాకుండా, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా విమానాన్ని కూల్చేందుకు సబోటాజ్ చేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు, బాంబు దాడి, ఇంజన్‌లో లోపం కలిగించడం, లేదా ఫ్యూయల్ సిస్టమ్‌తో ఆడుకోవడం వంటివి. గతంలో ఎయిర్ ఇండియా విమానాలపై టెర్రరిస్ట్ దాడుల చరిత్ర (1985 కనిష్క బాంబింగ్) ఈ భయాలను పెంచుతోంది. అయితే, ఇది ఇంకా దర్యాప్తులో ఉంది.. ఆధారాలు లేకుండా మాట్లడడం అంటే.. కేవలం అనుమానమే.

గుజరాత్ CM భూపేంద్ర పటేల్ గ్రీన్ కారిడార్, తక్షణ చికిత్సకు ఆదేశించారు. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్ మోహన్ నాయుడు స్థితిని పర్యవేక్షిస్తున్నారు. NDRF, ఫైర్ సర్వీసెస్, 24 అంబులెన్స్‌లతో రెస్క్యూ జరుగుతోంది. ఎయిర్ ఇండియా చైర్మన్ N చంద్రశేఖరన్ ఎమర్జెన్సీ సెంటర్, సపోర్ట్ టీమ్స్ ఏర్పాటు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కేంద్ర సహాయం హామీ ఇచ్చారు. ఎయిర్‌పోర్ట్ రోడ్లు మూసివేశారు. దర్యాప్తు ఇంజన్ ఫెయిల్యూర్, సబోటాజ్ కోణాలను పరిశీలిస్తోంది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *