రాజా రఘువంశీ హత్య కేసులో సోనమ్ లవర్స్ మరో ట్విస్ట్!! దృశ్యం 3 లెవల్లో!?

ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య కేసులో మేఘాలయ పోలీసులు సంచలన వివరాలు వెల్లడించారు. రాజా భార్య సోనమ్ రఘువంశీ, ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహ హత్య తర్వాత సోనమ్‌ను దాచేందుకు ఓ మహిళను చంపి, ఆమె మృతదేహాన్ని సోనమ్‌దిగా చిత్రీకరించాలని ప్లాన్ చేశారని PTI నివేదించింది. ఫిబ్రవరిలో ఇండోర్‌లో ఈ కుట్ర మొదలైంది. రాజ్ కుశ్వాహ ఈ ప్లాన్‌కు మాస్టర్‌మైండ్ అయితే.. సోనమ్ ఈ ప్లాన్ కి సహకరించిందని పోలీసులు తెలిపారు.

సోనమ్‌ను దాచేందుకు ఓ మహిళను చంపి, ఆమె మృతదేహాన్ని సోనమ్‌దిగా చూపించాలని కుట్ర! కానీ, ఈ లోపే పోలీసులకు దొరికిపోయారు!

మే 19న రాజా, సోనమ్ హనీమూన్‌కు మేఘాలయ చేరగా, రాజ్ సహచరులు అస్సాంలో ఉన్నారు. మే 23న వీసావ్‌డాంగ్ జలపాతం వద్ద ముగ్గురు కలిసి రాజాను కత్తితో హత్య చేసి, మృతదేహాన్ని లోయలో పడేశారు. సోనమ్ రెయిన్‌కోట్‌ను రక్తం మరకలతో అకాశ్‌కు ఇచ్చింది. ఆ తర్వాత సోనమ్ బుర్ఖా ధరించి గువాహటి, సిలిగురి, పాట్నా, ఆరా, లక్నో మీదుగా ఇండోర్ చేరింది. రాజ్ సూచనతో సోనమ్ అపహరణ నాటకం ఆడాలని భావించింది. అయితే, జూన్ 8న పోలీసులు అకాశ్‌ను అరెస్టు చేయడంతో రాజ్ భయపడి, సోనమ్‌ను కిడ్నాప్ నుంచి తప్పించుకున్నట్లు చెప్పమన్నాడు. ఘాజీపూర్‌లో సోనమ్ బయటపడింది. ఇదిలా ఉంటే.. ఐదుగురు నిందితులను ఎనిమిది రోజుల పోలీసు కస్టడీకి పంపారు. 90 రోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేస్తామని శిల్లాంగ్ SP వివేక్ సయీమ్ తెలిపారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *