- జూన్ 21న యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో భారీ కార్యక్రమం
- ప్లాన్–ఎ, ప్లాన్–బీ ప్రణాళికలతో 3.5 లక్షల మందికి ప్రత్యేక ఏర్పాట్లు
ప్రధానమంత్రి మోదీ సూచనతో, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న విశాఖ ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు 5 లక్షల మందితో ‘‘యోగాంధ్ర’’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. సోమవారం ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ‘‘యోగం ప్రతి కుటుంబ జీవనశైలి లో భాగం కావాలి. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఆసుపత్రి ఖర్చులు తగ్గిస్తుంది. యోగా ఒక గేమ్ ఛేంజర్’’ అని చెప్పారు.
విశాఖ డిక్లరేషన్‌తో ఆరోగ్యంపై స్పష్టమైన దిశ
ఈ భారీ యోగ ఈవెంట్ ని విజయవంతం చేసేందుకు 340 సెక్షన్లు ఏర్పాటు చేయనున్నట్టు సీఎం వెల్లడించారు. ఒక్కో సెక్షన్‌లో 1,000 మందికి వీలుగా మ్యాట్లు, టీషర్ట్లు, శిక్షకులు, వైద్యులు, వాలంటీర్లు ఉంటారని వివరించారు. వర్షం లేదా వాతావరణం అనుకూలించకపోతే AU గ్రౌండ్‌ను ప్రత్యామ్నాయ వేదికగా వినియోగిస్తారు. అదే రోజు ‘విశాఖ డిక్లరేషన్’ పేరిట యోగా ప్రాధాన్యంపై ఓ స్పష్టమైన ప్రకటన చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1 లక్ష ప్రాంతాల్లో యోగా సైట్స్ గుర్తించామని పేర్కొన్నారు. ఇప్పటికే 2.17 కోట్లమంది పేర్లు నమోదు చేసుకున్నట్టు వెల్లడించారు. ‘‘బిల్‌గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి ప్రివెంటివ్ హెల్త్ పై ముందడుగులు వేస్తున్నాం. ఆరోగ్య పరిరక్షణకు కుప్పం పైలట్ ప్రాజెక్టుగా మారుతుంది’’ అని చెప్పారు. ఈ సమీక్షలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.





