బుర్ఖాతో ప్రయాణం… ఒక్కసారి కూడా ఆగలేదు: డ్రైవర్‌ను ఏమంటున్నాడంటే?

🔸 హనీమూన్ హత్యకేసులో కీలక మలుపు
🔸 సోనం‌ను ఉత్తరప్రదేశ్‌కి తీసుకెళ్లిన డ్రైవర్‌ మోహిత్ వాంగ్మూలం
🔸 శిలాంగ్‌ పోలీసులు విచారణ వేగవంతం చేశారు

వివరాల్లోకి వెళ్తే…
రాజా రఘువంశీ హత్యకేసులో ప్రధాన నిందితురాలు సోనం, మే నెల చివర్లో ఉత్తరప్రదేశ్‌కి ప్రయాణించింది. దాదాపు 1,000 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణంలో బుర్ఖా ధరించి కనిపించకుండా వెళ్లింది. డ్రైవర్ మోహిత్ తెలిపిన వివరాలు ఇప్పుడు కేసులో కీలక ఆధారంగా మారాయి. జూన్‌ 8న సోనం, ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహాతో కలిసి ఇండోర్ నుంచి ఎర్టిగా కారులో బయలుదేరింది. ‘‘ఆమె బుర్ఖా ధరించి ఉంది. మొత్తం ప్రయాణంలో ఒక్కసారి కూడా ఆగలేదు. ఏ టీ హోటల్ దగ్గరైనా ఆగమన్నా.. ‘వద్దు, త్వరగా వెళ్లాలి’ అంది అని మోహిత్ చెప్పాడు. వారు అదే రాత్రి వరణాసికి చేరుకున్నారు. అక్కడి నుంచి సోనం ఘాజీపూర్‌కు వెళ్లి, ఓ ధాబా నుంచి తన సోదరునికి ఫోన్ చేసింది. అదే కాల్ ఆధారంగా పోలీసులు ఆమెను ట్రేస్ చేసి అరెస్ట్ చేశారు. అప్పటివరకు ఆమెను కూడా హత్యకు గురైనట్టు అనుకున్నారు. కానీ, ఆమె ఆ మిస్టరీలో ప్రధాన పాత్రధారిగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు.

పోలీసుల చర్యలు వేగవంతం
ప్రస్తుతం సోనం, రాజ్ కుశ్వాహా ఇద్దరూ శిలాంగ్ పోలీసుల కస్టడీలో ఉన్నారు. మిగతా ముగ్గురు నిందితులు — విశాల్, ఆనంద్, ఆకాష్‌లు జ్యుడీషియల్ కస్టడీకి వెళ్లారు. సోనం గతంలో పనిచేసిన సిబ్బందిని కూడా విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రాజా సోదరుడు విపిన్ మాట్లాడుతూ “ఇది మామూలు హత్య కాదు. పూర్తిగా ప్రణాళికతో చేసిన హత్య. దోషులకి గట్టి శిక్ష పడాలి.” అని డిమాండ్ చేశారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *