“AIతో నా పిల్లలు ఎక్కువ చేయగలుగుతారు!”: ఛాట్ జీపీటీ సీఈవో

🔸 ChatGPTలాంటి AI టూల్స్ వల్ల తన పిల్లలు చాలా పనులు చేయగలుగుతారు!- సీఈవో సమ్ ఆల్ట్‌మన్

🔸 AIతో భరోసా పెరుగుతోంది కానీ, అది తప్పులూ చెబుతుందని కూడా గుర్తింపు
🔸 తండ్రిగా మారిన తర్వాత, బేబీ కేర్ విషయంలో ChatGPT పెద్ద సహాయమన్న ఆల్ట్‌మన్

AI లాగైతే మన జీవితాల్లోకి వచ్చేసిందో.. అదే విధంగా తన పిల్లల భవిష్యత్తులో కూడా ఇది కీలక పాత్ర పోషించబోతుందని OpenAI సీఈవో సమ్ ఆల్ట్‌మన్ చెప్పారు. ఓపెన్‌ఏఐ కొత్తగా ప్రారంభించిన పాడ్‌కాస్ట్ తొలి ఎపిసోడ్‌లో ఆయన మాట్లాడారు. ఇటీవలే తండ్రైన ఆయన, “నా పిల్లలు AI కంటే తెలివిగా ఉండరేమో కానీ, మా తరం కంటే చాలా పనులు చేయగలుగుతారు” అని వ్యాఖ్యానించారు. “AIతో పిల్లలు ఏమేం పనులు చేస్తారు అనే దానికంటే… ఇది పిల్లలకు ఎలాంటి అవకాశాలు ఇస్తుందన్న దానిపై నేను ఎక్కువగా ఆలోచిస్తున్నా,” అన్నారు. “వారు ChatGPT లాంటి టూల్స్‌ను సులభంగా, సమర్థంగా వాడగలగడం వల్ల తమ సామర్థ్యం పెరుగుతుంది” అని చెప్పారు.

AI వల్ల సమస్యలూ వస్తాయ్
AI వల్ల సామాజిక వ్యవస్థల్లో కొన్ని సమస్యలు కూడా వస్తాయని ఆయన అంగీకరించారు. “AI వల్ల కొన్ని ఊహాజనితమైన అనుబంధాలు పెరిగే ప్రమాదం ఉంది. కానీ, సరిగ్గా నియంత్రణలు చేస్తే దాని లాభాలు విస్తృతంగా ఉంటాయి” అని వ్యాఖ్యానించారు. పేరెంటింగ్ కి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని ఆయన ఇలా పంచుకున్నారు.. “తండ్రి అయిన మొదటి కొన్ని వారాల్లో బేబీకి ఎలా సహాయం చేయాలో నాకు తెలియదు. ChatGPT నన్ను ఆ సమయంలో గట్టెక్కించింది” అని అన్నారు. అయితే ChatGPT తప్పులు చెబుతుందని (హాల్యూసినేట్ అవుతుందని) ఆయన గుర్తు చేశారు. “ఇంతవరకూ ఏ టెక్నాలజీపై భరోసా పెట్టకూడదన్నంతగా, ChatGPT పట్ల ప్రజలు విశ్వాసం పెంచుకున్నారు” అని చెప్పారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *