శ్రీశ్రీ రవిశంకర్‌ బయోపిక్: ‘వైట్‌’లో విక్రాంత్ మాస్సే – ఇదో స్పెషల్ స్టోరీ అంటున్న హీరో!

“ఆర్ట్ ఆఫ్ లివింగ్” అంటే మనలో చాలా మందికి తెలుసు. దాని వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌ గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఇప్పుడు ఆయన జీవితం ఆధారంగా ‘వైట్‌’ (White) అనే పేరుతో ఒక సినిమా రాబోతోందని తెలుసా? అది కూడా మన బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే శ్రీశ్రీ రవిశంకర్‌ పాత్రలో నటిస్తున్నారు! ఈ సినిమా షూటింగ్ ఈ ఆగస్టులోనే మొదలవబోతోంది. ఈ గొప్ప పాత్రను పోషించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని విక్రాంత్ చెబుతున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా గురించి విక్రాంత్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. “శ్రీశ్రీ రవిశంకర్‌గారి బయోపిక్‌లో నటించే ఛాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ‘వైట్’ షూటింగ్ ఆగస్టులో స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాలో కేవలం ఆయన నిజ జీవిత సంఘటనలే కాదు, కొలంబియాలో చాలా ఏళ్ళుగా జరుగుతున్న యుద్ధాన్ని ఆపడంలో ఆయన ఎంత ముఖ్య పాత్ర పోషించారో కూడా చూపిస్తున్నాం” అని విక్రాంత్ అన్నారు.

“ప్రపంచంలో శాంతి ఉండాలని ఆయన ఎంత కష్టపడ్డారో చాలా మందికి తెలియదు. ‘వైట్‌’ సినిమా ద్వారా ఆ విషయాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలనుకుంటున్నాం. అలాంటి గొప్ప వ్యక్తి పాత్రను పోషించడం నాకు దక్కిన గౌరవం. నేను ఎప్పటికీ ఆయనలా ఉండలేను. కానీ, ఆయనలా కనిపించడానికి, ఆయనలా ప్రవర్తించడానికి నా వంతు ప్రయత్నం మాత్రమే చేయగలను. చాలా నిజాయితీగా నా ప్రయత్నం చేస్తున్నాను” అని విక్రాంత్ మాస్సే తెలిపారు.

సోషల్ మీడియా ట్రోల్స్‌పై విక్రాంత్ స్పందన: ‘నాకు అనవసరం!’

ఇటీవలే విక్రాంత్ మాస్సే వరుస సినిమాలు ఒప్పుకున్నాక, కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంటున్నానని ప్రకటించాడు. దీనిపై సోషల్ మీడియాలో చాలా మంది విమర్శించారు. పబ్లిసిటీ కోసమే అలా చేశాడని కొందరు ట్రోల్ చేశారు. దీనిపై విక్రాంత్ కూల్‌గా స్పందించారు. “సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి పోస్ట్‌ను చూశాను. కానీ అలాంటి వాటి గురించి నేను పట్టించుకోను” అని తేల్చి చెప్పారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *