రతన్ టాటాను గుర్తు చేశారు: ఆనంద్ మహీంద్రాకు చిరంజీవి స్ఫూర్తిదాయక సందేశం!

Chiranjeevi Anand Mahindra Ratan Tata
  • పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా హుందాతనాన్ని ప్రశంశించిన మెగాస్టార్
  • మహీంద్రాను చూస్తే రతన్ టాటా గుర్తుకు వచ్చారని, ఆయనలోని విలువలు, సేవా తపన స్ఫూర్తిదాయకం అని చిరంజీవి ట్వీట్

తెలంగాణ గ్లోబల్ సమిట్‌లో మెగాస్టార్ చిరంజీవి, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాను కలిసిన విషయం తెలిసిందే. ఈ భేటీ తర్వాత చిరంజీవి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. “మీ వినయం, మనసుకు హత్తుకునే నడవడి నన్ను గాఢంగా ప్రభావితం చేసింది” అని చిరంజీవి అన్నారు. మహీంద్రాను చూస్తే తనకు దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా గుర్తుకు వచ్చారని ఆయన తెలిపారు. “మీ విలువలు, సేవా తపన నిబద్ధతతకి ప్రతీక” అని చిరంజీవి ప్రశంసించారు. ఆనంద్ మహీంద్రా యొక్క సాదాసీదా స్వభావం తనకు స్ఫూర్తిని ఇచ్చిందని చిరంజీవి చెప్పారు.

సీఎం రేవంత్‌కు ప్రత్యేక ధన్యవాదాలు

ఆనంద్ మహీంద్రా సేవా కార్యక్రమాల పట్ల తన మద్దతు కొనసాగిస్తానని చిరంజీవి తెలిపారు. “ఇలాంటి అర్థవంతమైన పనుల్లో మీతో భాగస్వామ్యం కావడం గౌరవంగా ఉంది” అని ఆయన వెల్లడించారు. ఈ స్ఫూర్తిదాయకమైన భేటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణమని, ఆయన ఆహ్వానంతోనే ఈ మీటింగ్ జరిగిందని చిరంజీవి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. దిగ్గజ నటుడు, పారిశ్రామికవేత్త మధ్య జరిగిన సంభాషణలు స్ఫూర్తిదాయక సందేశాలు ఫ్యాన్స్‌ను ఆనందింపజేశాయి.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
Breaking News
కేటగిరి

మా న్యూస్ అప్డేట్లు కోసం సబ్‌స్క్రైబ్ చేయండి!

Everyday we discover real news for you.