నాన్న నమ్మాడు.. అన్న ధైర్యం ఇచ్చాడు!: ఫెపాలీ వర్మ గెలుపు సీక్రెట్!!

Shafali Verma Father Support
  • 21 ఏళ్లకే వరల్డ్ కప్ గెలిచిన షెఫాలీ వర్మ, తన విజయం వెనుక తండ్రి మద్దతు
  • ‘ఆడపిల్ల క్రికెట్ ఆడితే ఏమొస్తుంది?’ అని విమర్శించిన వారికి తన తండ్రి ఇచ్చిన జవాబే తన విజయానికి కారణం అంటున్న షెఫాలి

21 ఏళ్ల వయసులో ప్రపంచ కప్ ట్రోఫీని ఎత్తుకున్న షెఫాలీ వర్మ కథనం ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. రోహ్తక్‌లోని ఇరుకైన సందుల నుంచి వరల్డ్ కప్ గెలవడం వరకు ఆమె పట్టుదల కనిపిస్తుంది. షెఫాలీ చాలా చిన్న వయసులోనే, అంటే 9 లేదా 10 ఏళ్లకే క్రికెట్‌ను ఎంచుకుంది. ఆమె ఉండే హరియాణా ప్రాంతంలో క్రికెట్ కంటే కబడ్డీ, రెజ్లింగ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అక్కడ ఆడపిల్లలు క్రికెట్ ఆడడం అస్సలు సాధారణం కాదు. అందుకే ఆమె కలలు మొదలైనప్పుడు మద్దతు కంటే విమర్శలే ఎక్కువగా వచ్చాయి.

నాన్నతో షెఫాలి..

తండ్రి ఇచ్చిన ధైర్యం:

షెఫాలీ తండ్రి ఒక్కరే ఆమెను బలంగా విశ్వసించారు. “నా తండ్రి మాత్రమే నన్ను నమ్మారు. ఆయన నమ్మకమే ఈ విజయానికి కారణం” అని షెఫాలీ చెప్పారు. చుట్టుపక్కల ప్రజలు “ఆడపిల్లను ఎందుకు పంపిస్తున్నారు? మహిళల క్రికెట్ ఎక్కడ ఉంది?” అని విమర్శించినా, ఆ వ్యాఖ్యలు తన వద్దకు రాకుండా తండ్రి చూసుకున్నారు. “మహిళల క్రికెట్ బతికే ఉంది, ఇంకా పెరుగుతుంది” అని తండ్రి వారికి జవాబిచ్చేవారు. 2025లో టీ20, వన్డే టీమ్స్‌లో స్థానం దొరకనప్పుడు తాను దాదాపు క్రికెట్‌ను వదిలేద్దామనుకున్నానని, అప్పుడు తన సోదరుడు, కుటుంబం మద్దతు ఇచ్చారని షెఫాలీ వెల్లడించారు.

రికార్డుల కంటే.. మనిషిగా:

షెఫాలీ కేవలం రన్స్, రికార్డుల గురించి మాట్లాడరు. “క్రికెట్ కొంత కాలమే ఆడతాం. ఆ తర్వాత ప్రజలు మనలోని మానవత్వం కోసమే గుర్తుంచుకుంటారు. నేను మంచి మనిషిగా గుర్తుండాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా తన పని తాను చేసుకుంటూ, క్రమశిక్షణతో ఉండడమే పట్టుదల అని ఆమె చెప్పారు. ఆమె ప్రపంచ కప్ గెలిచాక, “మమ్మల్ని సమర్థించిన వారికీ, సమర్థించని వారికీ కృతజ్ఞతలు. సమర్థించని వారే మరింత కష్టపడటానికి మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు” అని కాన్ఫిడెంట్ గా చెబుబుతోంది షెఫాలి.

అమ్మ, తమ్ముడితో..

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *