‘Akhanda 2’కు RSS Chief ప్రశంసలు: Mohan Bhagwat ఆశీర్వాదం మా Teamకు గౌరవం!

Director Boyapati Srinu and Balakrishna during the promotion of Akhanda 2 movie
  • నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2’ చిత్రం దేశం, ధర్మం, దైవం వంటి విలువలను నేటి తరానికి అర్థవంతంగా చేరవేస్తుందని RSS చీఫ్ మోహన్ భగవత్ ప్రశంస
  • సమాజానికి విలువలతో కూడిన చిత్రాలు మరింతగా రావాలని ఆయన ఆకాంక్ష
  • ఈ ఆశీర్వాదం తమ Team కు స్ఫూర్తినిచ్చిందని దర్శకుడు బోయపాటి శ్రీను తెలిపారు

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ 2: తాండవం’ సినిమా దేశవ్యాప్తంగా ఘన విజయం సాధిస్తూ ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రం దేశం, ధర్మం, దైవం వంటి భారతీయ శాశ్వత విలువలను నేటి తరం ప్రేక్షకులకు అర్థవంతంగా చేరవేసే కథాంశంతో రూపొందడంతో, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.

ఈ సందర్భంగా RSS Chief మోహన్ భగవత్ ‘అఖండ 2’ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. దర్శకుడు బోయపాటి శ్రీనుకి సినిమా అఖండ విజయాన్ని సాధించాలని ఆశీర్వదించారు. (Akhanda 2 Mohan Bhagwat) అలాగే సమాజానికి సానుకూల దిశ చూపించే, విలువలతో కూడిన చిత్రాలు మరింతగా రావాలని ఆయన ఆకాంక్షించారు.

నాపై బాధ్యత పెరిగింది

మోహన్ భగవత్ ప్రశంసలపై దర్శకుడు బోయపాటి శ్రీను స్పందిస్తూ, “దేశం, ధర్మం, దైవం వంటి మూల విలువలను నేటి తరానికి గుర్తు చేయాలనే సంకల్పంతోనే ‘అఖండ 2’ను రూపొందించాం” అని తెలిపారు. “గౌరవనీయులైన మోహన్ భగవత్ ఆశీర్వాదం మా Team కు అపార గౌరవం ఇచ్చింది. ఇది మాకు మరింత బాధ్యత, స్ఫూర్తినిచ్చింది” అని ఆయన అన్నారు.

‘అఖండ 2’ భారతీయ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక భావాలు, దేశభక్తి వంటి అంశాలను సమకాలీన కథన శైలితో మేళవించింది. ఈ సినిమా యువతలో ధర్మబోధ, ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యత వంటి విలువలను స్పష్టంగా ప్రతిబింబిస్తుందని విమర్శకులు కూడా ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం అన్ని ప్రధాన కేంద్రాల్లో House Full Shows తో రన్ అవుతున్న ఈ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తోంది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *