- అక్కినేని అఖిల్ (Akhil Akkineni) త్వరలో తండ్రి కాబోతున్నాడనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
- దీనిపై నాగార్జున స్పందిస్తూ.. “సరైన సమయం వచ్చినప్పుడు చెబుతాను” అని దాటవేశారు.
- ఈ వ్యాఖ్యలతో అక్కినేని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని అఖిల్, జూన్‌లో తన ప్రియురాలు జైనబ్ రవ్జీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ జంట వెకేషన్ ట్రిప్స్ నుండి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటాయి. (Akhil Akkineni Wife Pregnant News Nagarjuna Reaction) అయితే, గత కొన్ని రోజులుగా జైనబ్ ప్రెగ్నెంట్ అని, అఖిల్ త్వరలో తండ్రి కాబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.

తాతగా Nagarjuna ప్రమోషన్?
ఈ వార్తలపై అక్కినేని కుటుంబం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, తాజాగా ఒక Health Event కు హాజరైన నాగార్జునను విలేఖరి ఈ ప్రశ్న అడగ్గా ఆయన ఆసక్తికరంగా స్పందించారు.”మీరు తండ్రి నుంచి తాతగా ప్రమోట్ అవుతున్నారట.. ఇది నిజమేనా?” అని విలేఖరి అడగ్గా, నాగార్జున నవ్వుతూ.. “సరైన సమయం వచ్చినప్పుడు మీకు తెలియజేస్తాను” అని బదులిచ్చారు. సాధారణంగా ఇలాంటి వార్తలు అబద్ధమైతే సెలబ్రిటీలు వెంటనే ఖండిస్తారు. కానీ నాగార్జున గారు ఖండించకుండా, ‘సరైన సమయం’ గురించి మాట్లాడటంతో.. అఖిల్ తండ్రి కాబోతున్నాడనే వార్త నిజమేనని అభిమానులు ఫిక్స్ అయిపోతున్నారు.





