- పర్మినెంట్ రెసిడెంట్ వీసా కోసం సాజిద్ 27 సార్లు దరఖాస్తు చేసినట్లు గుర్తింపు
- నాంపల్లి అన్వర్ ఉల్ కాలేజీలో 1998లో బీఏ పూర్తి చేసిన సాజిద్
- హైదరాబాద్‌లోని ఆస్తి అమ్మి ఆస్ట్రేలియాలో ఇల్లు కొనుగోలు చేసినట్లు వెల్లడి
- 2012 తర్వాత పాస్‌పోర్ట్‌ను రెన్యూవల్ చేయించుకోని వైనం
ఆస్ట్రేలియాలో కాల్పుల ఘటన తర్వాత ఉగ్రవాది సాజిద్ నేపథ్యంపై కేంద్ర, రాష్ట్ర అధికారులు జరిపిన విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు బయటపడ్డాయి. ఆస్ట్రేలియా పర్మినెంట్ రెసిడెంట్ వీసా కోసం అతడు ఏకంగా 27 సార్లు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. చివరకు రెసిడెంట్ రిటర్న్ వీసా మాత్రమే పొందగలిగాడు. గత 27 ఏళ్లుగా భారత్-ఆస్ట్రేలియా మధ్య అతడి రాకపోకలపై అధికారులు ఇప్పుడు లోతుగా ఆరా తీస్తున్నారు(Terrorist Sajid Australia Visa Investigation Details).
రెండుసార్లు పెళ్లి
సాజిద్ 2000 నవంబర్ 8న స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడ వెన్నసా అనే యువతిని వివాహం చేసుకున్నాడు.
- పార్ట్నర్ వీసా: భార్యకు పర్మినెంట్ రెసిడెన్సీ ఉండటంతో 2001లో తన వీసాను పార్ట్నర్ వీసాగా మార్చుకున్నాడు.
- కుమారుడి జననం: ఈ దంపతులకు 2001 ఆగస్టు 12న నవీద్ అనే కుమారుడు జన్మించాడు.
- హైదరాబాద్‌లో మళ్ళీ పెళ్లి: 2003లో భార్యతో కలిసి హైదరాబాద్ వచ్చిన సాజిద్, ముస్లిం సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహం చేసుకున్నాడు.
ఆస్తుల విక్రయం..
విచారణలో సాజిద్ ఆర్థిక లావాదేవీల వివరాలు కూడా బయటపడ్డాయి. 2018లో హైదరాబాద్ వచ్చి తన వారసత్వ ఆస్తిని విక్రయించాడు. ఆ డబ్బుతో ఆస్ట్రేలియాలో ఒక ఇల్లు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. సాజిద్ చివరిసారిగా 2012లో హైదరాబాద్‌కు వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు తన పాస్‌పోర్ట్‌ను రెన్యూవల్ చేయించుకోలేదని స్పష్టమైంది. దీంతో అతడు అక్రమంగా అక్కడ నివసిస్తున్నాడా లేదా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.






