- పిల్లలు మనం చెప్పే మాటల కంటే.. మనం చేసే పనులనే ఎక్కువగా గమనిస్తూ నేర్చుకుంటారు
- పిల్లలకు బాస్ లా కాకుండా స్నేహితుడిలా ఉంటేనే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
- తల్లిదండ్రుల లోపలి భయం, కోపం, అభద్రతా భావమే పిల్లల వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయి
పిల్లలు అల్లరి చేస్తున్నారనో.. మాట వినడం లేదనో మనం తరచూ ఫిర్యాదు చేస్తుంటాం. వారిని క్రమశిక్షణలో పెట్టేందుకు రకరకాల రూల్స్ పెడుతుంటాం. కానీ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ మాత్రం మరోలా చెబుతున్నారు. నిజమైన మార్పు పిల్లల నుంచి కాదు.. తల్లిదండ్రుల నుంచే మొదలవ్వాలని ఆయన అంటున్నారు. మీరు ప్రశాంతంగా ఉండకుండా.. మీ పిల్లల్ని ప్రశాంతంగా ఉండమని చెబితే అది ఎప్పటికీ సాధ్యం కాదు. (Sadhguru Parenting Tips Conscious Parenting Guide)
“పిల్లలకు మీరు ఇచ్చే ఉత్తమ కానుక.. మీలోని ప్రశాంతత, సంతోషం.. వారు మిమ్మల్ని చూసి జీవితాన్ని నేర్చుకుంటారు”
ముందు మీపై మీరు వర్క్ చేయండి!
సద్గురు దృష్టిలో పేరెంటింగ్ అంటే పిల్లల్ని కంట్రోల్ చేయడం కాదు, వారికి ఒక స్వేచ్ఛా వాతావరణాన్ని కల్పించడం. పిల్లలు గొప్ప అబ్జర్వర్లు.. మీరు ఒత్తిడిలో ఉన్నా, చిరాకు పడుతున్నా ఆ ఎమోషన్స్‌ను వారు వెంటనే పట్టేస్తారు. అందుకే మీరు పిల్లల్ని సరిదిద్దే ముందు మీ లోపలి భయాలు, కోపాలను నియంత్రించుకోవాలి. వారితో బాస్‌లా కాకుండా స్నేహితుడిలా మెలిగినప్పుడే.. వారు తమ మనసులోని మాటను స్వేచ్ఛగా పంచుకుంటారు. మీ అంచనాలను వారిపై రుద్దకుండా.. వారి సహజ సిద్ధమైన ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి. మీరు మానసికంగా ఎదిగినప్పుడే.. మీ పిల్లలు కూడా ఎమోషనల్ గా స్ట్రాంగ్ అవుతారని సద్గురు గుర్తు చేస్తున్నారు.
పిల్లలను పెంచడంలో మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఏంటి? సద్గురు చెప్పినట్లుగా పిల్లలతో స్నేహితుడిలా ఉండటం సాధ్యమేనని మీరు భావిస్తున్నారా? కామెంట్ చేయండి.





