వెండితెరపై రంభ రీ ఎంట్రీ! తమిళ నిర్మాత మళ్లీ ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధం!

  • తమిళ నిర్మాత కలైపులి ఎస్.థాను రంభ రీ ఎంట్రీపై క్లారిటీ
  • భర్త ప్రోత్సాహంతో మళ్లీ సినిమాల్లోకి రావాలని నిర్ణయం

1990లలో స్టార్ హీరోల సరసన మెరిసిన నటి రంభ మరోసారి వెండితెరపై కనిపించనున్నారని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ లో తమిళ నిర్మాత కలైపులి ఎస్.థాను ఈ విషయంపై స్పందించారు. రంభ భర్త తనకు మంచి సినిమాల్లో అవకాశం ఇచ్చేలా చూడమని కోరాడని, తాను అలాంటి ప్రాజెక్ట్ ఉంటే తప్పకుండా సంప్రదిస్తానని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ ప్రకటనతో రంభ రీ ఎంట్రీ ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న రంభ, ఆ తర్వాత స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు దక్కించుకున్నారు. యమదొంగ, దేశముదురు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌తో అదరగొట్టారు. 2010లో ఇంద్రకుమార్ ను వివాహం చేసుకొని కెనడాలో స్థిరపడిన ఆమె, కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నా, పలు టీవీ డ్యాన్స్ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. 2008లో చివరిసారి వెండితెరపై కనిపించిన రంభ, ఇప్పుడు మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
Breaking News
కేటగిరి

మా న్యూస్ అప్డేట్లు కోసం సబ్‌స్క్రైబ్ చేయండి!

Everyday we discover real news for you.