ఉద్యోగులకు చైనా కంపెనీ బంపర్ బోనస్.. గట్టిగా లెక్కపెడితే కోట్లాది రూపాయలు చేతికొచ్చినట్టే!
చైనాకు చెందిన హెనన్ మైన్ క్రేన్ సంస్థ ఉద్యోగులకు ఊహించని (Bonus Offer) బహుమతి అందించింది. వార్షిక బోనస్‌గా సంస్థ మొత్తం రూ.70 కోట్లు కేటాయించింది. అయితే, ఇది బ్యాంక్ అకౌంట్లకు బదులు, నేరుగా క్యాష్ రూపంలో టేబుల్ మీద పెట్టారు. సుమారు 60 నుంచి 70 మీటర్ల పొడవైన టేబుల్‌పై ఈ మొత్తం అమర్చి, ఉద్యోగులను 30 టీమ్స్‌గా విభజించారు. ఒక్కో టీమ్ నుంచి ఇద్దరు వచ్చి, 15 నిమిషాల్లో ఎంత లెక్కపెడతారో అంత తీసుకెళ్లొచ్చని షరతు పెట్టారు. ఈ వినూత్న ఆఫర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 2023 జనవరిలోనూ హెనన్ మైన్ క్రేన్ సంస్థ ఇదే విధంగా రూ.70 కోట్ల బోనస్‌ను ఉద్యోగులకు అందజేసింది. ఈసారి కూడా అదే విధానాన్ని కొనసాగించడంతో నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.






