హృతిక్‌ గాయం.. ‘వార్‌ 2’ రిలీజ్‌ వాయిదా పడుతుందా?

‘వార్‌ 2’ చిత్రీకరణలో హృతిక్‌ గాయపడ్డారన్న వార్తలు.. నెల రోజుల విశ్రాంతి సూచించిన వైద్యులు, సినిమా రిలీజ్‌ డిలే కావచ్చన్న టాక్‌

బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌, టాలీవుడ్‌ హీరో ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వార్‌ 2’ చిత్రీకరణ తుదిదశలో ఉంది. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై-థ్రిల్లర్‌ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే, తాజాగా హృతిక్‌ గాయపడ్డారని, దీంతో సినిమా విడుదల వాయిదా పడే అవకాశముందనే వార్తలు షికారు చేస్తున్నాయి. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ – హృతిక్‌లపై ఓ భారీ డాన్స్‌ నంబర్‌ ప్లాన్‌ చేశారు. ముంబయిలోని యశ్‌రాజ్‌ స్టూడియోలో వేసిన గ్రాండ్‌ సెట్‌లో 500 మంది డ్యాన్సర్లతో ఈ పాటను చిత్రీకరిస్తుండగా, హృతిక్‌ గాయపడ్డారని సమాచారం. బాలీవుడ్‌ మీడియా కథనాల ప్రకారం, ఆయనకు వైద్యులు నెల రోజుల విశ్రాంతి సూచించారు. అయితే, దీని కారణంగా సినిమా ఆలస్యం అవుతుందా? లేదా గాయానికి సంబంధించి మేజర్‌ సమస్య లేదా? అనే విషయంపై చిత్రబృందం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
Breaking News
కేటగిరి

మా న్యూస్ అప్డేట్లు కోసం సబ్‌స్క్రైబ్ చేయండి!

Everyday we discover real news for you.