- అంబటి రాయుడు మెరుపులు: 74 పరుగులతో విజయంలో కీలక పాత్ర
- వెస్టిండీస్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం
భారత మాజీ క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయిలో తమ దక్షతను మరోసారి రుజువు చేశారు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ తొలి ఎడిషన్‌లో సచిన్ తెందుల్కర్ నేతృత్వంలోని ఇండియా మాస్టర్స్ జట్టు విజేతగా నిలిచింది. రాయ్‌పూర్‌లో జరిగిన ఫైనల్‌లో వెస్టిండీస్ మాస్టర్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. అంబటి రాయుడు 74 పరుగులతో చెలరేగి, జట్టును ఘన విజయానికి నడిపించాడు.
రాయుడు దంచికొట్టాడు
ఫైనల్ మ్యాచ్‌లో మొదట వెస్టిండీస్ 148/7 పరుగులే చేయగలిగింది. వినయ్ కుమార్ (3/26), షాబాజ్ నదీమ్ (2/12) కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు. అనంతరం లక్ష్యఛేదనలో రాయుడు ధాటిగా ఆడి, 50 బంతుల్లో 74 పరుగులు సాధించాడు. సచిన్ తెందుల్కర్ (25), యువరాజ్ సింగ్ (13 నాటౌట్), స్టువర్ట్ బిన్నీ (16 నాటౌట్) తో కలిసి ఇండియా మాస్టర్స్ 17.1 ఓవర్లలో విజయం సాధించింది.





