కేఎల్‌ రాహుల్‌ ఆటపై సంజయ్ మంజ్రేకర్ ప్రశంసలు!!

ఒక్కోసారి ఓ ఆటగాడికి బౌలర్ల కంటే, అతని స్వంత ఆలోచనాశైలి శత్రువుగా మారుతుందని మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు.

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌పై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసలు కురిపించారు. ఒత్తిడిలోనూ రాహుల్ తన శైలిని మార్చుకొని చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడని పేర్కొన్నారు. గతంలో అతడి బ్యాటింగ్‌ను విమర్శించినవారికి రాహుల్ సమాధానం చెప్పినట్లేనని తెలిపారు.

‘శత్రువు’పై గెలిచిన రాహుల్

ఒక్కోసారి ఓ ఆటగాడికి బౌలర్ల కంటే, అతని స్వంత ఆలోచనాశైలి శత్రువుగా మారుతుందని మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో రాహుల్ నెమ్మదిగా ఆడినట్లు విమర్శలు వచ్చాయి. కానీ, ఈసారి అతడు తన ఆటతీరును మార్చుకుని, ప్రెషర్‌లోనూ జట్టును నెగ్గించాడు. ఆస్ట్రేలియాతో సెమీఫైనల్‌లో కోహ్లీతో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్‌తో ఫైనల్లోనూ, అతడి మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ భారత్ విజయానికి దోహదపడింది. రాహుల్ చాంపియన్స్ ట్రోఫీలో ఐదు మ్యాచ్‌ల్లో 140 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 97.90. టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌లో చోటు దక్కించుకున్నాడు. వన్డేల్లో రాహుల్ తన స్థానాన్ని స్థిరపరచుకున్నాడని, భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధిస్తాడని మంజ్రేకర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *