
కొల్లేరు అందాల అతిథి: నార్తరన్ షవెల్లర్నార్తరన్ షవెల్లర్ పక్షి, రంగు రంగుల శరీర సౌష్టవంతో చూపరులను ఆకర్షిస్తుంది. బాతు ఆకారంతో ఉండి, ముక్కు తెడ్డులా ఉండటంతో స్థానికులు దీనిని తెడ్డుమూతి బాత అని పిలుస్తారు.ఈ పక్షులు 44 నుంచి 52 సెం.మీ పొడవు మరియు 600 గ్రాముల బరువుతో ఉంటాయి. మగ మరియు ఆడ పక్షులు వేర్వేరు రంగుల్లో కనువిందు చేస్తాయి. ముక్కు నల్లగా ఉన్న పక్షి మగగా, ఎరుపు రంగులో ఉన్న పక్షి ఆడగా గుర్తించాలి. నార్తరన్ షవెల్లర్ జార్జియా, ఉక్రెయిన్ మరియు దక్షిణ ఆసియాలో నివసిస్తాయి. శీతాకాలంలో, ఇవి మనదేశంతో పాటు ఇరాన్, ఇరాక్, పాకిస్థాన్, థాయిల్యాండ్, మలేసియా మరియు చైనా ప్రాంతాలకు వలసొస్తాయి. ఈ పక్షులు పురుగులు మరియు నీటి మొక్కలను ఆహారంగా తీసుకుంటాయి. మగ పక్షి ఆకర్షణీయంగా కనిపించేందుకు అనేక వర్ణాలను మార్చుకుంటుంది.





