భారత్‌లో కృత్రిమ మేధ (AI) సామర్థ్యాలను అభివృద్ధి చేయడం, డేటా సెంటర్లను విస్తరించడం కోసం ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 3 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల బెంగళూరులో జరిగిన ఈవెంట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. 2030 నాటికి 10 మిలియన్ల మందికి ఏఐ స్కిల్స్‌పై శిక్షణ అందించడమే తమ లక్ష్యమని చెప్పారు.
సత్య నాదెళ్ల పర్యటనలో కీలక ప్రకటనలు
ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న సత్య నాదెళ్ల ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్‌ను ఏఐ రంగంలో ఉన్నత స్థానంలో నిలిపేందుకు మైక్రోసాఫ్ట్ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. కొత్త పెట్టుబడులు, ఆవిష్కరణల ద్వారా భారత నిపుణుల సామర్థ్యాలను మరింత అభివృద్ధి చేస్తామని నాదెళ్ల అన్నారు. 2025లో ప్రారంభించిన ‘అడ్వాంటేజ్ ఇండియా’ కార్యక్రమం కింద ఇప్పటికే లక్ష్యాలను చేరుకున్నామని, 2030 నాటికి 10 మిలియన్ల మందికి శిక్షణ ఇవ్వాలని సిద్ధమవుతున్నామని తెలిపారు.






