2017 నుంచి యెమెన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ప్రియాకు, 2018లో అక్కడి సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించింది. యెమెన్ జాతీయుడి హత్య కేసులో దోషిగా నిర్దారణ అయి, ఉరిశిక్షకు గురైన భారతీయ నర్సు నిమిషా ప్రియాకి యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్-అలిమి క్షమాభిక్షను తిరస్కరించారు. తలాల్ అబ్దో మహదీ అనే యెమెన్ పౌరుడి పాస్‌పోర్ట్‌ను తీసుకునే క్రమంలో ఆమె అతడికి మత్తుమందు ఇంజెక్ట్ చేసి హత్యచేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.
తర్వాత, నిమిషా ప్రియాను కాపాడేందుకు ఆమె కుటుంబం చేస్తున్న ప్రయత్నాలను కేంద్ర విదేశాంగ శాఖ గుర్తించింది. “ప్రియాను శిక్ష నుండి తప్పించేందుకు కుటుంబం చేస్తున్న ప్రయత్నాలను మేము అర్థం చేసుకున్నాం,” అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు. నిమిషా తల్లి ప్రేమ కుమారి యెమెన్ రాజధాని సనాకు వెళ్లి బాధిత కుటుంబంతో చర్చలు జరిపారు, కానీ తలాల్ కుటుంబం రూ.70 లక్షల పరిహారం డిమాండ్ చేయడంతో పరిస్థితులు కష్టంగా మారాయి.





