‘తల్లికి వందనం’ పథకానికి భారీ కేటాయింపు.. మే నెలలో అమలు చేస్తాం: లోకేశ్

  • రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ‘తల్లికి వందనం’
  • బడ్జెట్‌లో రూ.9407 కోట్లు కేటాయించినట్టు లోకేశ్ వెల్లడింపు

విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయంగా రాష్ట్ర ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శాసనసభలో మాట్లాడిన ఆయన, ఈ పథకానికి రూ.9407 కోట్లు కేటాయించామని ప్రకటించారు. ‘‘గత ప్రభుత్వ హయాంలో ఏడాదికి రూ.5540 కోట్లు మాత్రమే కేటాయించేవారు. ఇప్పుడు 50% ఎక్కువ నిధులు మంజూరు చేశాం’’ అని చెప్పారు. ఈ పథకాన్ని మే నెలలో అమలు చేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో, అంతా మంది ఈ పథకానికి అర్హులవుతారని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్-6 హామీలను నెరవేర్చడంలో భాగంగానే ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *