భారత స్వాతంత్ర్యం కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన పోరాటం నేటి యువతకు ఆదర్శనీయమని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించి భారతీయుల్లో పోరాట స్ఫూర్తిని నింపిన యోధుడు నేతాజీ అని ఆయన ప్రశంసించారు. నేతాజీ జయంతి సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. స్వాతంత్ర్య పోరాటం కోసం నేతాజీ చూపిన ధైర్యం, త్యాగం ప్రతి భారతీయుడికి గర్వకారణమని, ఆయన ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకమని ఆయన తెలిపారు.





