
ఉత్తర అమెరికాలో క్రిస్మస్ సీజన్లో, అందమైన నార్తర్న్ కార్డినల్స్ పక్షులు సందడి చేస్తుంటాయి. వీటి రంగు మరియు కిలకిలారావాలు అందరినీ ఆకర్షిస్తాయి. ఈ పక్షులు ఎరుపు రంగులో ఉంటాయి, అందుకే వాటిని క్రిస్మస్ పక్షులు అని కూడా అంటారు. మగ మరియు ఆడ పక్షుల మధ్య స్పష్టమైన తేడా ఉంది. మగ పక్షులు ఎరుపు రంగులో ఉంటే, ఆడ పక్షులు గోధుమ లేదా బూడిద రంగులో ఉంటాయి.ఈ కార్డినల్స్ తమ ఈకల ద్వారా ఎరుపు రంగును పొందుతాయి. అవి తినే ఆహారం ద్వారా కెరోటినాయిడ్లు పొందుతాయి, ఇవి వాటికి ఆకర్షణీయమైన రంగులను ఇస్తాయి.

ఆడ పక్షులలో ఎరుపు తక్కువగా ఉండి, పసుపు మరియు బూడిద రంగులు ఎక్కువగా కనిపిస్తాయి.నార్తర్న్ కార్డినల్స్ ప్రత్యేకత ఏమిటంటే, వీటి కిలకిలారావాలు పాటల మాదిరిగా వినిపిస్తాయి. అవి భూమిపైకి దిగి పరిగెత్తేటప్పుడు కిలకిలారావాలు చేస్తాయి. మగ మరియు ఆడ రెండూ పాడతాయి. ఈ పక్షులు 24 రకాలుగా కిలకిలారావాలు చేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.ఈ కార్డినల్స్ జీవితాంతం ఒక భాగస్వామితోనే ఉంటాయి. అవి ఎప్పుడూ కలసే కనిపిస్తాయి మరియు కలిసి గూడు కట్టుకుంటాయి. గుడ్లు పెట్టిన తర్వాత మగ పక్షులు కొంత సమయం గూడుకు దూరంగా ఉంటారు.

ఆ తర్వాత ఇద్దరూ తమ పిల్లలను శ్రద్ధగా పెంచుతారు.ఆడ కార్డినల్స్ ఎక్కువగా కిలకిలారావాలు చేస్తాయి. అవి వేటగాళ్ళకు తమ గూడును గుర్తించకుండా ఉండేందుకు సందడి చేస్తాయని పరిశోధనల్లో తేలింది. ఈ సమయంలో, అవి ప్రత్యేక శబ్దాలను కూడా చేస్తాయి, ఇది మగపక్షితో ఆహారం తీసుకురమ్మని చెప్పేందుకు ఉపయోగపడుతుంది.కొన్నిసార్లు ఈకలు లేని కార్డినల్స్ కూడా కనిపిస్తుంటాయి. ఇవి ప్రతి సంవత్సరం తమ ఈకలను తొలగిస్తాయి, ఆ తర్వాత కొత్త ఈకలు వస్తాయి. ఈ సమయంలో అవి ఈకలు లేని పక్షులుగా కనిపిస్తుంటాయి.




